10వ తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

10వ తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నలిచ్చింది. ప్రభుత్వం గతంలో నిర్ణయించినట్లగానే  జూన్ 8 నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు పడ్డాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు…GHMC, రంగారెడ్డి మినహా అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. GHMC ఏరియాలో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. అయితే ఆ ఏరియాలోని విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని… సప్లిమెంటరీ పరీక్షలను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు.

అంతేకాదు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పది రోజులకోసారి పరిస్థితి సమీక్షించాలని సూచించింది హైకోర్టు. పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగితే అక్కడ వాయిదా వేసేలా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.దీనికి సంబంధించి తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది హైకోర్టు.