బండి పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి

 బండి పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి

బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ నిర్వహించనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పాదయాత్ర భైంసాలో నుంచి వెళ్ళకూడదని స్పష్టం చేసింది. నిర్మల్ మీదుగా పాదయాత్ర వెళ్లాలని తెలిపింది. ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన బహిరంగ సభ కూడా భైంసాకు 3 కిలోమీటర్ల దూరంలో జరుపుకోవాలని న్యాయస్థానం సూచించింది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య మాత్రమే సభ జరుపుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 500 మంది తో మాత్రమే పాదయాత్ర  చేయాలని.. 3వేల మందితోనే సభ జరుపుకోవాలని హైకోర్టు నిర్దేశించింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని సూచించింది. కార్యకర్తలు కర్రలు, వెపన్స్ వాడొద్దని తెలిపింది. లా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడాలని ఆదేశించింది. 

సెక్యూరిటీ రీజన్స్ పేరుతో పోలీసులు బండి పాదయాత్రకు ఒక్కరోజు ముందు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రకు అనుమతించేలా ఆదేశించాలని కోరింది. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పాదయాత్ర కొనసాగించేందుకు ఈ మేరకు అనుమతిచ్చింది