డీఎంఈగా వాణి నియామకం చెల్లదు : హైకోర్టు

డీఎంఈగా వాణి నియామకం చెల్లదు : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు :  మెడికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ ఇన్​చార్జ్ డైరెక్టర్‌‌‌‌గా ఎన్‌‌‌‌ వాణి నియామక జీవో 63 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ జీవో తెలంగాణ స్టేట్‌‌‌‌ సబార్డినేట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ రూల్స్‌‌‌‌ 10 (హెచ్‌‌‌‌)కు, 2017లో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లకు వ్యతిరేకంగా ఉందని తేల్చింది. చట్ట ప్రకారం రెగ్యులర్‌‌‌‌ డీఎంఈని నియమించాలని ప్రభు త్వాన్ని ఆదేశించింది.

ఇన్​చార్జ్ డీఎంఈగా డాక్టర్‌‌‌‌ ఎన్‌‌‌‌ వాణిని నియమించడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రి సూపరిం టెండెంట్‌‌‌‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. జనవరి 25న జారీ చేసిన ఏడీఎంఈల ప్రొవిజన ల్‌‌‌‌ సీనియారిటీ జాబితా ప్రకారం..శివరామప్రసాద్‌‌‌‌ టాప్‌‌‌‌లో ఉన్నార ని, వాణిని నియమించడం చెల్లదని లాయర్‌‌‌‌ కృష్ణయ్య వాదించారు.