మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, జంక్ ఫుడ్ వంటి కారణాలతో చాలా మంది దంపతులు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లలు పుట్టడం లేదని మానసిక క్షోభకు గురవుతున్నారు. అమ్మతనం కోసం ఆరాట పడుతూ ఆసుపత్రులు, డాక్టర్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అయితే.. మెడికల్ పరంగానే కాకుండా కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఫాలో కావడం వల్ల కూడా సంతానోత్పత్తి సమస్యలను అధిగమించవచ్చంటున్నారు నిపుణులు.
ఇందుకు మన వంట ఇంట్లో ఉండే మెంతులు బాగా పని చేస్తాయంట. మెంతులు స్త్రీలలో హార్మోన్లను సమతుల్యం చేయడం, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషియస్తాంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మెంతుల్లో ఉండే ఫైబర్, విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు సంతానోత్పత్తికి ఎంతోగానో ఉపయోగపడుతాయంట.
మెంతులు సంతానోత్పత్తిని ఎలా పెంచుతాయి..?
హార్మోన్ల సమతుల్యత: మెంతులు పురుషులు, స్త్రీలలో హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా అండోత్సర్గము క్రమంగా మారుతుంది. పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. స్పెర్మ్ కౌంట్, చలనశీలతను పెంచ
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ: మెంతి పొడి PCOSకి కారణమయ్యే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. PCOS అనేది హార్మోన్ల అసమతుల్యత కారణం వస్తుంది. ఇది స్త్రీలలో వంధ్యత్వానికి కారణమవుతుంది. మెంతి పొడి తీసుకోవడం ద్వారా అందులోని ఫైబర్ కంటెంట్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను కూడా మెంతి పొడి మెరుగుపరుస్తుంది.
ఒత్తిడి తగ్గించడం: గర్భధారణ సమయంలో స్త్రీలు ఒత్తిడికి గురి కావడం చాలా ప్రమాదకరం. ఈ క్రమంలో మెంతులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా సహజ గర్భధారణకు మెంతులు ఉపయోగపడతాయి.
ఎలా తీసుకోవాలి..?
సంతానోత్పత్తిని పెంచడానికి మెంతులు, మెంతి పొడిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు.
నానబెట్టిన మెంతులు: నానబెట్టిన మెంతులు తినాలనుకుంటే ఒక గ్లాసు నీరు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి రాత్రంతా నానబెట్టండి. నానబెట్టిన మెంతులను ఉదయం ఖాళీ కడుపుతో తినవచ్చు.
మెంతి పొడి: మెంతులను పొడి రూపంలో తీసుకోవాలనుకుంటే మెంతి గింజలను ఎండబెట్టి తర్వాత పొడి చేసుకోవాలి. ఈ పొడిలో అర టేబుల్ స్పూన్ గోరువెచ్చని పాలు లేదా నీటితో క్రమం తప్పకుండా తాగొచ్చు.
వ్యాసంలో పేర్కొన్న చిట్కాలు, సూచనలు నిపుణుల ద్వారా సేకరించిన సమాచారం మాత్రమే. దీనికి వృత్తిపరమైన వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించే ముందు.. లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించండి.
