కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై హైకోర్టులో విచారణ వాయిదా

కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై హైకోర్టులో విచారణ వాయిదా

కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పిటిషన్ పై వాదనలు వినిపించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయడంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు విన్నవించారు. మున్సిపల్ కౌన్సిల్ మాత్రం దాన్ని రద్దు చేయాలంటూ తీర్మానం చేసిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. టౌన్ ప్లానింగ్ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం మాస్టర్ ప్లాన్ పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 22 కు వాయిదా వేసింది.