పేపర్ లీక్ పై.. హైకోర్టు విచారణ ఏప్రిల్ 11కు వాయిదా

పేపర్ లీక్ పై.. హైకోర్టు విచారణ ఏప్రిల్ 11కు వాయిదా

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ పై హైకోర్టు.. విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. ఇవాళ పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. పేపర్ లీక్ లో నిందితులను ఇప్పటికే సిట్ విచారిస్తోంది. ఈ క్రమంలో ఇవాళ జరిగిన హైకోర్టు విచారణలో ప్రభుత్వం తరుపు న్యాయవాది సిట్ నివేదికను సమర్పించేందుకు సమయం కోరారు. ఈ నేపథ్యంలో  రిపోర్ట్ సమర్పించేందుకు ప్రభుత్వం తరుపు న్యాయవాది ఏజీ జీఎస్ ప్రసాద్ కు హైకోర్టు 3 వారాల టైం ఇచ్చింది. తర్వాత సిట్ స్టేటస్ రిపోర్ట్ ను తమకు ఇవ్వాలని హైకోర్ట్ న్యాయవాదులను ఆదేశించింది. 

ఈ విచారణలో పిటిషనర్ తరుపు న్యాయవాది వివేక్ ధన్కా, ప్రభుత్వం తరుపు న్యాయవాది ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్ట్ లో తమ వాదనని వినిపించారు. ఒకే మండలంలో 20 మందికి మంచి మార్కులు వచ్చాయని, దీనిపై అనుమానాలు కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు.