రాజాసింగ్పై పీడీ యాక్ట్ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ

రాజాసింగ్పై పీడీ యాక్ట్ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ

గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీ యాక్ట్కు సంబంధించిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారంటూ ఆయన భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. దాన్ని పరిశీలించేందుకు సమయం కావాలన్న న్యాయస్థానం విచారణకు ఇవాళ్టికి వాయిదా వేసింది. పోలీసులు పీడీ యాక్ట్ పెట్టడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ రెండు నెలలుగా జైలులోనే ఉన్నారు. 

ఇదిలా ఉంటే గోషామహల్‌‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌పై ప్రివెంటీవ్‌‌ డిటెన్షన్‌‌ యాక్ట్‌‌ అమలుకు అడ్వయిజరీ బోర్డ్‌‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్‌‌ను సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. పీడీ యాక్ట్‌‌ను ఎత్తివేయాలని రాజాసింగ్‌‌ భార్య ఉషాబాయీ వేసిన రివోక్‌‌ పిటిషన్‌‌ను రిజెక్ట్‌‌ చేసింది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించింది. సుప్రీంకోర్ట్‌‌ ప్రొసీజర్‌‌ ప్రకారమే చర్యలు తీసుకున్నారని గుర్తించింది. చర్లపల్లి సెంట్రల్‌‌ జైలులో ఉన్న రాజాసింగ్‌‌పై నిబంధనల ప్రకారం ఏడాది కాలం పీడీ అమలు చేయాలని ఆదేశించింది. బోర్డ్‌‌ ఇచ్చిన తీర్పుపై రాజాసింగ్‌‌తరుఫు న్యాయవాది కరుణసాగర్‌‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డ్‌‌ తీర్పును సవాల్‌‌ చేస్తూ ‌‌హైకోర్టుకు వెళ్తామన్నారు. పీడీ యాక్ట్‌‌ను సవాల్‌‌ చేస్తూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌‌ ఫైల్‌‌ చేశామన్నారు.  బోర్డు తీర్పుపై కూడా అప్పీల్‌‌కు వెళ్తామని చెప్పారు.