పరేడ్తో కూడిన వేడుకలు నిర్వహించాల్సిందే : హైకోర్టు

పరేడ్తో కూడిన వేడుకలు నిర్వహించాల్సిందే : హైకోర్టు

రాష్ట్రంలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవ నిర్వహణపై కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని పరేడ్ తో కూడిన వేడుకలు నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించకపోవడంపై దాఖలైన పిటిషన్ పై విచాణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్.. కొవిడ్ కారణంగా పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించడం లేదని చెప్పారు. రాజ్ భవన్లో ఇప్పటికే గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ పిటిషన్ రాజకీయ దురుద్ధేశంతో వేశారని ఏజీ కోర్టుకు విన్నవించారు. అయితే కోవిడ్ ప్రోటోకాల్ జీవో కోర్టుకు ఎందుకు సమర్పించలేదని కోర్టు ఏజీని ప్రశ్నించింది. 1950 నుంచి దేశంలో గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయని.. పెరేడ్ తప్పకుండా నిర్వహించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పెరేడ్ ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయించుకోవాలని సూచించింది.