
ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులు అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌కు బెయిల్ మంజూరుపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్ మంజూరును వ్యతిరేకిస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారించింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లకు నోటీసులు జారీ చేసింది. బెయిల్ మంజూరుపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ తదుపరి విచారణ డిసెంబర్ 1కి కోర్టు వాయిదా వేసింది.
నవంబర్ 14న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లకు సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీనిపై సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే అదే రోజు మద్యం కుంభకోణం వ్యవహారంలో విచారణకు సహకరించలేదని అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం అభిషేక్, విజయ్ నాయర్ లు ఈడీ కస్టడీలో ఉన్నారు.