విద్యార్థులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు: హైకోర్టు జడ్జి వేణుగోపాల్

విద్యార్థులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు: హైకోర్టు జడ్జి వేణుగోపాల్

హైదరాబాద్: విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏనుగుల వెంకట వేణుగోపాల్ అన్నారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే ప్రోత్సాహకాలు అందించడం చాలా అవసరమని చెప్పారు. కాచిగూడలోని మున్నూరు కాపు భవనంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ అవార్డులు అందజేశారు. మున్నూరు కాపు వసతి గృహం ట్రస్ట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ అవార్డులు ఇచ్చారు. 

ఈసందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏనుగుల వెంకట వేణుగోపాల్ ప్రతిభ ఉన్న విద్యార్థుల్ని గుర్తించి అవార్డులు అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే కాంక్ష ఏర్పడి.. లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించుకుంటారని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలు, కుల మతాలకు అతీతంగా విద్యార్థులను ప్రోత్సహించాలని న్యాయమూర్తి జస్టిస్ ఏనుగుల వెంకట వేణుగోపాల్ కోరారు.

మ్యాజిక్ కూడా విద్యనే

మంత్రాలు, తంత్రాలు.. లేవని.. మ్యాజిక్ కూడా ఒక విద్యనేనని  ప్రముఖ మెజీషియన్ సామల వేణు చెప్పారు. విద్యార్థులలో స్ఫూర్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగ పడతాయని తెలిపారు. ఈ సందర్భంగా సామల వేణు  చేసిన మ్యాజిక్ షో ఆకట్టుకుంది.