ప్రజలు కంప్లయింట్ చేస్తే పట్టించుకోరేం:..పోలీసుల తీరు మారాలి: హైకోర్టు

ప్రజలు కంప్లయింట్ చేస్తే పట్టించుకోరేం:..పోలీసుల తీరు మారాలి: హైకోర్టు

హైదరాబాద్: ప్రజలు కంప్లయింట్ చేయడానికి వస్తే పట్టించుకోవడం లేదని పోలీసుల తీరుపై హైకోర్టు జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేవారు. పోలీసులు ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సీజే ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజలనుంచి ఫిర్యాదులు తీసుకున్నా..ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని..ఫిర్యాదుదారులను భయాందోళన లకు గురి చేస్తున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

ప్రజల కోసమే పోలీసులు పనిచేయాల్సి ఉందని వ్యాఖ్యానించిన హైకోర్టు.. పోలీసు విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీని ఆదేశించింది. పోలీస్ స్టేషన్లకు ఎవరూ సరదాగా రారన్న హైకోర్టు.. ఎఫ్ ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు కష్టంగా మారిందని వ్యాఖ్యానించింది. 

కరీంనగర్ టూటౌన్ పీఎస్ మహిళా ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేయకపోవడంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ చేపట్టని హైకోర్టు ధర్మాసనం..పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని డీజీపీని ఆదేశించింది. తప్పుడు ఫిర్యాదు అయినా తీవ్రమైన ఆరోపణలుంటే ఎఫ్ ఐఆర్ నమోదు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈకేసులో ఇన్ స్పెక్టర్ ఆఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.