
హైదరాబాద్, వెలుగు: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించిన ఆర్వోకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. తెలంగాణ రీజనల్ సింగరేణి కార్మిక సంఘానికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఎందుకు లేదో చెప్పాలని ఆదేశించింది. సింగరేణి ఎన్నికల్లో పాల్గొనే అర్హత రీజనల్ సింగరేణి కార్మిక సంఘానికి లేదని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఇటీవల తేల్చిచెప్పారు. ఎలక్షన్ ఆఫీసర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రీజనల్ సింగరేణి కార్మిక సంఘం తరఫున అధ్యక్షుడు కే.శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వాదనల అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి మంగళవారం నోటీసులు జారీ చేశారు. విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.