మానవ అక్రమ రవాణాపై..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

మానవ అక్రమ రవాణాపై..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు : మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం అమలు తీరు గురించి వివరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మానవ అక్రమ రవాణకు గురైన మహిళలను, బాలలను రక్షించాక.. వాళ్లను సేఫ్ హౌస్​ల తరలింపునకు గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ విషయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సిటీ పోలీస్ కమిషనర్​లు కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని సూచించింది. విచారణను జులై 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌‌‌‌‌‌‌‌ సూరేపల్లి నంద ప్రకటించారు. ప్రజ్జ్వల స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసింది.