దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు

దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: దానం నాగేందర్ అనర్హత పిటిషన్ సోమవారం (ఏప్రిల్ 15) హైకోర్టు విచారణ చేపట్టింది. పార్టీ మారిన దానం నాగేందర్ కు, శాసన సభా స్పీకర్, కార్యదర్శికి  హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పాడి కౌశిక్ రెడ్డి వేసిన ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.

బీఆర్ఎస్ టికెట్ పై  ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దానం..గెలిచి ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్ ను ఫిరాయింపుదారుల నిరోధక చట్టం ప్రకారం అనర్హుడిగా ప్రకటించాలని అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.తర్వాత కాంగ్రెస్‌లో చేరారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ శాసన సభాపతికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.

అయితే తమ కంప్లైంట్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దానంపై అనర్హత వేటు వేసేలా శాసన సభా స్పీకర్ ను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. జస్టిస్ విజయ సేన్ రెడ్డి ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు. దానం నాగేందర్ ను సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిందని.. ఆయన పార్టీ ఫిరాయించడానికి ఇది సాక్ష్యం అని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

వాదనలు విన్న న్యాయస్థానం దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.