హైదరాబాద్, వెలుగు: ములుగులో అడ్వకేట్ మల్లారెడ్డి హత్య కేసులో కౌంటర్ పిటిషన్ వేయాలని సర్కార్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. సీఎస్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, ములుగు ఎస్పీ.. ఎస్‌హెచ్‌వోలు తమ వాదనలతో 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. వీరందరికీ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల బెంచ్ సోమవారం నోటీసులిచ్చింది. మల్లారెడ్డిని హత్యకు నిరసన వ్యక్తం చేసిన హైకోర్టు బార్ అసోసియేషన్, అదే రోజున చీఫ్ జస్టిస్‌కు వినతిపత్రం అందజేసింది. దీన్ని కోర్టు పిల్‌గా పరిగణించి.. సోమవారం విచారించింది. లాయర్ల రక్షణకు యంత్రాంగం ఉండాలని అభిప్రాయపడింది. కోర్టుకు సహాయకారిగా ఉండేందుకు సీనియర్ లాయర్లు జి.విద్యాసాగర్, ఎల్.రవిచందర్‌లను హైకోర్టు నియమించింది.
