రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు

రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు : ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో న్యూ టెక్నాలజీ కోర్సులకు రాష్ట్ర సర్కారు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదంటూ దాఖలైన రిట్‌‌‌‌‌‌‌‌ పిటిషన్లను హైకోర్టు శనివారం విచారణ జరిపింది. ప్రభుత్వ వాదనల తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపిన హైకోర్టు..రాష్ట్ర సర్కారుకు నోటీసులు ఇచ్చింది. ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్, సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌‌‌‌‌‌‌‌ తదితర కోర్సులు నిర్వహించడానికి ఏఐసీటీఈ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినా సర్కార్‌‌‌‌‌‌‌‌ అనుమతిం చడం లేదని 14 ప్రైవేట్​ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీలు హైకోర్టులో రిట్లు దాఖలు చేశాయి.

వీటిపై చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌‌‌‌‌ రెడ్డిలతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ శనివారం విచారణ జరిపింది. కొత్త కోర్సుల్లో అడ్మిషన్లు జరిపేందుకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి కోర్టుకు విన్న వించారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 11కి వాయిదా వేసింది.