అంధుడుకి న్యాయం చేసిన హైకోర్టు

అంధుడుకి న్యాయం చేసిన హైకోర్టు

హైదరాబాద్ : ఉద్యోగం విషయంలో ఓ అంధుడికి న్యాయం చేస్తూ తీర్పు చెప్పింది హైకోర్టు. మహబూబ్ నగర్ కు చెందిన  మురళీధర్ అనే దృష్టి లోపం ఉన్న అంధుడు బ్లైండ్ కోటాలో క్లాస్ ఫోర్ బ్యాక్ లాక్ టైపిస్ట్ పోస్ట్ కు ఎన్నికైయ్యాడు. అయితే..అతడికి ఉద్యోగం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ అధికారులు. దీనిపై మురళీధర్ గతంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా..శుక్రవారం విచారణ జరిపింది హైకోర్టు.

పిటిషన్ విచారించిన హైకోర్టు మురళీధర్ కు ఉద్యోగం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. వెంటనే మురళీధర్ కు జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు కలెక్టర్. దీంతో కోర్ట్ ధిక్కరణ పిటిషన్ ను క్లోజ్ చేసింది హైకోర్టు.