హర్యానా నుంచి ఢిల్లీకి మళ్లీ రైతుల పాదయాత్ర

హర్యానా నుంచి ఢిల్లీకి మళ్లీ రైతుల పాదయాత్ర

శంభు సరిహద్దును వారం రోజుల్లోగా తెరవాలని పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు  హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్-హర్యానాలను కలిపే ఈ శంభు సరిహద్దు వ‌ద్ద  ఫిబ్రవరి 13న రైతులు భారీగా నిర‌స‌న‌ల‌ను ప్రారంభించ‌డంతో హర్యానా ప్రభుత్వం దీనిని మూసివేసింది. గ‌త అయిదు నెల‌లుగా ఈ స‌హ‌రిహ‌ద్దు మూసే ఉంది.  ఇప్పుడు కోర్టు ఉత్తర్వులతో సరిహద్దును ఓపెన్​ చేయడంతో రైతులు మళ్లీ పాదయాత్ర చేయాలని నిర్ణయంతీసుకుంటున్నారు. శంభు సరిహద్దును తెరిచేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కిసాన్ మజ్దూర్ మోర్చా హర్యానా కన్వీనర్, భారతీయ కిసాన్ యూనియన్ లోక్‌శక్తి రాష్ట్ర అధ్యక్షుడు జగ్బీర్ ఘసోలాతో సహా పలువులు  రైతులు ఆహ్వానించారు. 

ALSO READ | జూన్ 25ను సంవిధాన్ హత్యాదివాస్‌గా ప్రకటించిన కేంద్రం

రైతులు తమ సమస్యల పరిష్కారానికి మళ్లీ ఆందోళన బాట పట్టనున్నారు.  జులై 14 న శంభు సరిహద్దుల నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు శంభు. ఖానౌరీ సరిహద్దు ప్రాంతాల్లోని రైతులతో సమావేశం జరగుతుందని రైతు నాయకులు తెలిపారు.  ఈ సమావేశంలో పలు రైతు పాల్గొని  MSP .. రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు చర్చించనున్నారు. మళ్లీ ఉద్యమం ఎలా చేయాలి.. అనే అంశంపై చర్చించనున్నారు. అవసరమైతే దేశవ్యాప్తంగా రైతులు ఈ ఉద్యమంలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటారు.  తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు రైతు ఉద్యమం కొనసాగుతుందని రైతుల సంఘాల నేతలు తెలిపారు. శంభు సరిహద్దు వద్ద రైతుల నిరసన కిసాన్ మజ్దూర్ మోర్చా ... యునైటెడ్ కిసాన్ మోర్చా (రాజకీయ రహిత) నేతృత్వంలో జరుగుతోందని ..  గతంలో పంజాబ్​ రైతులు .. హర్యానా సరిహద్దులో 6 నెలల పాటు నిరసన తెలిపారు.  ప్రభుత్వాల రైతు సమస్యలను కాలరాస్తూ మొండిగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రాంతాన్ని మూసి వేయడంతో రైతులు కోర్టును ఆశ్రయించారు.  

ALSO READ | Supreme Court: హైవేను అలా బ్లాక్ చేయొచ్చా?..హర్యానా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్

శంభు సరిహద్దులో రైతుల నిరసన కారణంగా సామాన్యులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.ముఖ్యంగా అంబాలాలోని వ్యాపారవేత్తలు తమ వ్యాపారం నిర్వహించ‌డంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపి శంభు సరిహద్దు గుండా రహదారిని తెరవడానికి వారిని శాంతింపజేయాలి. ఇది సమీపంలో నివసించే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది, అలాగే ఇది వ్యాపారవేత్తలు తమ పనిని నిర్వహించడానికి సులభతరం చేస్తుందని  పేర్కొన్నారు.

ALSO READ | ఆధార్ కార్డు చూపించి నన్ను కలవాలి: ఎంపీ కంగనా కామెంట్స్పై తీవ్రవిమర్శలు

అయితే రైతులు ర‌హ‌దారిని దిగ్బంధించలేదని, ఫిబ్రవరిలో బారికేడ్లు వేసి తమ ఢిల్లీ చలో మార్చ్‌ను ప్రభుత్వమే ఆపిందని కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. త‌మ డిమాండ్ల‌ను ఆమోదించాల‌ని ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు రైతులు ఢిల్లీ చ‌లో మార్చ్ ప్రారంభించిన‌ట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 13 నుంచి తమ పాదయాత్రను భద్రతా దళాలు అడ్డుకోవడంతో రైతులు పంజాబ్‌, హ‌ర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసనలు చేస్తున్నార‌ని చెప్పారు.