న్యూ డెమోక్రసీ నేత లింగన్న మృతదేహానికి రీ పోస్ట్ మార్టం

న్యూ డెమోక్రసీ నేత లింగన్న మృతదేహానికి రీ పోస్ట్ మార్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… గుండాల మండలంలో జరిగిన ఎన్ కౌంటర్ పై ఈ రోజు రాష్ట్ర హైకోర్టు లో విచారణ జరిగింది. ఎన్ కౌంటర్ లో చనిపోయిన న్యూ డెమోక్రసీ నేత లింగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గాంధీ హాస్పిటల్ సూపర్డెంట్ ఆధ్వర్యంలో రీ పోస్ట్ మార్టం జరిపించాలని ప్రభుత్వానికి  హైకోర్టు సూచించింది. పోస్ట్ మార్టమ్ చేసిన తర్వాత షీల్డ్ కవర్ లో రిపోర్ట్ ను సమర్పించాలని మెడికల్ బోర్డు సీనియర్ అధికారులను ఆదేశించింది కోర్టు.

ఎన్ కౌంటర్ పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. పోస్ట్ మార్టం పూర్తి చేసిన తర్వాత డెడ్ బీడీలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పింది కోర్టు. రిపోర్ట్ మొత్తం ఈ నెల 5న వరకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది హై కోర్ట్. 302 సెక్షన్ ప్రకారం నకిలీ ఎన్ కౌంటర్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు పిటిషనర్.