థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు వారంలో ప్రణాళిక ఇవ్వండి

థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు వారంలో  ప్రణాళిక ఇవ్వండి

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులకు వైద్యారోగ్యశాఖ నివేదిక సమర్పించింది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు వారం రోజుల్లో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది కోర్టు. నిపుణుల కమిటీ భేటీ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదంటూ కామెంట్ చేసింది న్యాయస్థానం. థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుందని హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయని....కరోనాతో అనేక మంది చనిపోయారని చెప్పింది కోర్టు. గత అనుభావాలతో నష్టాన్ని నివారించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల పాజిటివిటీ రిపోర్టు సమర్పించాలని...వారంలో నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించాలంది. తమ ఆదేశాలు అమలు కాకపోతే హెల్త్ డైరెక్టర్, కేంద్ర నోడల్ ఆఫీసర్ హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది కోర్టు.