నాలుగు వారాల్లో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయండి: హైకోర్టు

నాలుగు వారాల్లో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయండి: హైకోర్టు
  • నాలుగు మార్కులు కలపొద్దు
  • ఓయూ ఆధ్వర్యంలో కమిటీ వేయండి
  • కమిటీ ముందు  ప్రశ్నలుంచి నిర్ణయించండి
  • హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామాకాలకు మార్గం సుగమమైంది. కానిస్టేబుళ్ల నియామాకాలకు సంబంధించి గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును  డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దరిమిలా తెలంగాణలో 15,640 పోలీస్ కానిస్టేబుళ్ల నియామాకాలకు  మార్గం సుగమమైంది. ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. 

 కొత్త కమిటీ ముందు నాలుగు ప్రశ్నలు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో  కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి  నిర్వహించిన రాత పరీక్షలో   122, 130, 144 ప్రశ్నలకు తెలుగులోకి అనువదించలేదు. 57వ ప్రశ్నతప్పుగా ఉన్నందున ప్రశ్నాపత్రం నుండి తొలగించాలని  తెలంగాణ హైకోర్టు గతేడాది అక్టోబర్ 10న ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ కొందరు హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీలుకు వెళ్లారు. విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.