ఓల్డ్ ఏజ్ హోమ్స్‌‌ ఎన్ని ఉన్నాయో చెప్పండి..హైకోర్టు

ఓల్డ్ ఏజ్ హోమ్స్‌‌ ఎన్ని ఉన్నాయో చెప్పండి..హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏర్పాటు చేసిందీ లేనిదీ తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌‌ దాఖలు చేయాలని చీఫ్‌‌ సెక్రటరీ, ఉమెన్‌‌ అండ్‌‌ చైల్డ్‌‌ వెల్‌‌ఫేర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చింది.  విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ శ్రవణ్‌‌కుమార్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ప్రకటించింది.  

తల్లిదండ్రులు, సీనియర్‌‌ సిటిజన్స్‌‌ నిర్వహణ, సంక్షేమ చట్టం–2007 సెక్షన్‌‌ 19 ప్రకారం జిల్లాకు ఒకటి చొప్పున వోల్డ్‌‌ ఏజ్‌‌ హోమ్స్‌‌ ఉండాలనే నిబంధనను అమలు చేయలేదని, 2022 ఆగస్టు నాటికి 19 మాత్రమే ఉన్నాయని అందిన లేఖను హైకోర్టు పిల్‌‌గా పరిగణించి విచారణ చేపట్టింది.