గుంతల రోడ్లపై రిపోర్టు ఇవ్వండి.. రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు ఆదేశం

గుంతల రోడ్లపై రిపోర్టు ఇవ్వండి.. రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు ఆదేశం
  •     చిన్నారి చనిపోయిన ఘటన సుమోటోగా స్వీకరణ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని గుంతల రోడ్లపై స్టేటస్‌‌ రిపోర్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్‌‌ దాఖలు చేయాలంది. నిజాంపేట మున్సిపాలిటీని కూడా ప్రతివాదుల లిస్ట్​లో చేర్చాలంది. చీఫ్‌‌ సెక్రటరీ, ఆర్‌‌అండ్‌‌బీ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ అండ్‌‌ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ముఖ్య కార్యదర్శితో పాటు నిజాంపేట మున్సిపాలిటీకి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్​లోని బాచుపల్లిలో గుంతల రోడ్డు కారణంగా ఓ చిన్నారి చనిపోయింది. తన బిడ్డ దీక్షితను కిశోర్‌‌ బైక్‌‌పై స్కూల్​కు తీసుకెళ్తుండగా, గుంతల రోడ్డు కారణంగా స్కూటీ స్కిడ్ అయింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఆ టైమ్ లో వెనుక నుంచి వచ్చిన బస్సు.. వారి పైనుంచి దూసుకెళ్లింది. పాప అక్కడికక్కడే చనిపోగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ అందింది. దీన్ని సుమోటోగా స్వీకరించి.. చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ టి.వినోద్‌‌కుమార్​ల డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన అనంతరం.. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.