గీతం యూనివర్సిటీకి హైకోర్టు షాక్..విద్యుత్తు బకాయిలపై కీలక ఆదేశం

గీతం యూనివర్సిటీకి హైకోర్టు షాక్..విద్యుత్తు బకాయిలపై కీలక ఆదేశం
  • విద్యుత్తు బకాయిల్లో రూ.54 కోట్లు చెల్లించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు:విద్యుత్తు బకాయిలు రూ.108 కోట్లకుగాను రూ.54 కోట్లు చెల్లించాలంటూ గీతం ట్రస్టుకు హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం చెల్లించడానికి గీతం యూనివర్సిటీకి మూడు వారాల గడువు ఇచ్చింది. బకాయిలు చెల్లించడంలో విఫలమైతే విద్యుత్తు సరఫరాపై తగిన చర్య తీసుకోవచ్చని టీజీఎస్పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్పష్టం చేసింది. 

విద్యుత్తు బకాయిలు రూ.118 కోట్లు చెల్లించాలని లేదంటే సరఫరా నిలిపివేస్తామంటూ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టును గీతం ఆశ్రయించింది. దీనిపై విచారించిన సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి గీతం పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణార్హమేనని, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. 

వీటిని సవాలు చేస్తూ టీజీఎస్పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాడి ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూడిన బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం విచారణ చేపట్టింది.