జన్వాడ డ్రోన్‌‌‌‌‌‌ కేసులో కౌంటర్​ వేయండి..హైకోర్టు ఆదేశం

జన్వాడ డ్రోన్‌‌‌‌‌‌ కేసులో కౌంటర్​ వేయండి..హైకోర్టు ఆదేశం

రేవంత్‌‌‌‌రెడ్డి పిటిషన్‌‌‌‌పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత కేటీఆర్​ జన్వాడ ఫామ్​హౌస్‌‌‌‌ను డ్రోన్‌‌‌‌తో చిత్రీకరించారంటూ నమోదైన కేసును, ఎల్బీనగర్‌‌‌‌ కోర్టులో పెండింగ్‌‌‌‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలంటూ సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌లపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఈ కేసులు నమోదయ్యాయి.

వాటిని కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌‌‌‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. రేవంత్‌‌‌‌రెడ్డి తరఫున సీనియర్‌‌‌‌ న్యాయవాది ఎస్‌‌‌‌.నిరంజన్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని పబ్లిక్‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌ పల్లె నాగేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేశారు.