కళావతి, వెంకటస్వామి ట్రస్ట్ సేవలు భేష్..1,212 మందికి కృత్రిమ అవయవాలు పంపిణీ

కళావతి, వెంకటస్వామి ట్రస్ట్ సేవలు భేష్..1,212 మందికి కృత్రిమ అవయవాలు పంపిణీ
  • సహకరిస్తున్న మంత్రి వివేక్​కు ధన్యవాదాలు
  •     లయన్స్​ క్లబ్​ డిస్ట్రిక్ట్​ గవర్నర్​ కోదండరాం

గోదావరిఖని, వెలుగు : రామగుండం లయన్స్​ క్లబ్​ఆధ్వర్యంలో గడ్డం కళావతి, వెంకటస్వామి మెమోరియల్​ట్రస్ట్​ద్వారా గోదావరిఖనిలో ఇప్పటివరకు1,212 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారని, ఇందుకు సహకరిస్తున్న రాష్ట్ర మంత్రి వివేక్​ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు లయన్స్​క్లబ్​ డిస్ట్రిక్ట్​ గవర్నర్​సింహరాజు కోదండరాం తెలిపారు.  అధికారిక పర్యటనలో భాగంగా లయన్స్​ క్లబ్​ గవర్నర్​ పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

రామగుండం లయన్స్​ క్లబ్​ అధ్యక్షుడు ఎల్లప్ప ఆధ్వర్యంలో ఆదివారం 31 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. గతంలో రాజస్థాన్​లోని జైపూర్​కు వెళ్లి కృత్రిమ అవయవాలు పెట్టుకునేవారని, కానీ నేడు రామగుండం లయన్స్​ క్లబ్​ ఆవరణలోనే వాటిని అందజేస్తున్నారని, ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

అంతకుముందు స్థానిక లక్ష్మినగర్​లేబర్​అడ్డాలో అల్ఫాహార వితరణ, లయన్స్​ భవన్​లో కుట్టు మెషీన్ల పంపిణీ, ఎన్టీపీసీ మేడిపల్లి సాయిసేవా సమితిలో 50 కేజీల బియ్యం, స్టూడెంట్లకు స్టీల్​ప్లేట్లు, శాలపల్లి, ఎల్కలపల్లి గేట్, పద్మావతి నగర్​లో సిమెంట్​ బెంచీలు, లక్ష్మిపూర్​ పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బందికి దుస్తుల పంపిణీ, మీల్స్​ ఆన్​ వీల్స్​ కార్యక్రమంలో భాగంగా అన్నప్రసాద వితరణ చేశారు. గాంధీనగర్​లోని గోశాలలో ఆవులకు ఎండు గడ్డి అందజేశారు.

 ఈ సందర్భంగా లయన్స్​గవర్నర్​ కోదండరాం మాట్లాడుతూ రామగుండం లయన్స్ క్లబ్ సభ్యులు సమాజ సేవలో ముందు భాగాన నిలిచారని, ఇతర లయన్స్ క్లబ్బులకు ఆదర్శంగా సమాజ అవసరానికి అవసరమైన సేవలు చేస్తున్నారని కొనియాడారు. 

ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ డిస్ట్రిక్ట్​గవర్నర్​ ఎం.ప్రమోద్​కుమార్​ రెడ్డి, అధ్యక్షుడు వడ్లకొండ ఎల్లప్ప, సెక్రటరీ ముడతనపల్లి సారయ్య, ట్రెజరర్ రాజేంద్రకుమార్, జోన్​ చైర్మన్​ పి.మల్లికార్జున్​, రీజియన్​ చైర్మన్​ కె.రాజేందర్​, సీనియర్​లయన్​మెంబర్స్​మినేష్ నారాయన్ టండన్, మేడిశెట్టి గంగాధర్, బంక రామస్వామి,  తిలక్ చక్రవర్తి, పోకల ఆంజనేయులు, శరత్ బాబు, సత్యనారాయణ, రమణయ్య, భేణి గోపాల్ త్రివేది, మనోజ్ కుమార్ అగర్వాల్, కోలేటి శ్రీనివాస్, దొమ్మేటి తిరుపతి, తానిపర్తి గోపాల్​రావు, అధిక సంఖ్యలో లేడి లయన్స్  పాల్గొన్నారు.