హైదరాబాద్​లో సౌండ్‌‌‌‌‌‌‌‌ లిమిట్స్​పై వివరాలివ్వండి

హైదరాబాద్​లో సౌండ్‌‌‌‌‌‌‌‌ లిమిట్స్​పై వివరాలివ్వండి
  •     రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సిటీలో శబ్ద పరిమితులపై జారీ చేసిన సర్క్యులర్‌‌‌‌‌‌‌‌, దాని అమలుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర సర్కారును హైకోర్టు ఆదేశింది. సిటీలోని ఫంక్షన్‌‌‌‌‌‌‌‌ హాల్స్​ లో శబ్దం పరిమితులకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. తాడ్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌ బోయినపల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియల్‌‌‌‌‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌ హాల్స్ నుంచి విపరీతమైన శబ్ద కాలుష్యం వెలువడుతోందని పేర్కొంటూ మిలిటరీ అదనపు చీఫ్‌‌‌‌‌‌‌‌ ఇంజినీరు కల్నల్‌‌‌‌‌‌‌‌ సతీశ్ భరద్వాజ్‌‌‌‌‌‌‌‌ రాసిన లేఖను హైకోర్టు పిల్‌‌‌‌‌‌‌‌గా పరిగణించింది.  

ఈ పిల్‌‌‌‌‌‌‌‌ను చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్​లతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ విచారించింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ మహమ్మద్‌‌‌‌‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ.. శబ్ద కాలుష్య అంశంపై ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. దీని ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత డీజే సౌండ్స్‌‌‌‌‌‌‌‌ ఉండకూడదని వెల్లడించారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ చెబుతున్న రెండు ఫంక్షన్‌‌‌‌‌‌‌‌ హాల్స్‌‌‌‌‌‌‌‌ పరిధిలో పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.

బోయినపల్లిలో శబ్ద కాలుష్యం వెలువడే ఫంక్షన్‌‌‌‌‌‌‌‌ హాల్స్‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకునే అధికారం సికిం ద్రాబాద్‌‌‌‌‌‌‌‌ కంటోన్మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డుకు ఉందని గుర్తుచేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని బోర్డును ఆదేశించింది. శబ్ద కాలుష్య నిబంధనలపై జారీ చేసిన ఉత్తర్వుల గురించి రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.  విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.