హైకోర్టు సీజే, కేఏ పాల్కు పాలాభిషేకం

హైకోర్టు సీజే, కేఏ పాల్కు పాలాభిషేకం

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కేఏ పాల్ చిత్ర పటాలకు కామారెడ్డి రైతులు పాలాభిషేకం చేశారు. మాస్టర్ ప్లాన్‭ వివాదం పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు గేటు బయట ఉజ్జల్ భుయాన్, కేఏ పాల్ ఉన్న ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. మాస్టర్ ప్లాన్ వివాదంపై కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ ను హోల్డ్ లో పెట్టామన్న ప్రభుత్వ వాదనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్ ప్లాన్‌పై ముందుకు వెళ్లవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశానికి సంబంధించి సింగిల్ బెంచ్‌లో ఉన్న మరో పిటిషన్‌ను డివిజన్ బెంచ్‌లో ఇంప్లీడ్ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.