హైడ్రా పనితీరుపై హైకోర్టు ప్రశంసలు.. టీడీఆర్‌‌‌‌‌‌‌పై స‌‌‌‌‌‌‌‌రైన విధానం అవసరమని సూచన

హైడ్రా పనితీరుపై హైకోర్టు ప్రశంసలు.. టీడీఆర్‌‌‌‌‌‌‌పై స‌‌‌‌‌‌‌‌రైన విధానం అవసరమని సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా పనితీరును హైకోర్టు సోమవారం అభినందించింది. ఆక్రమ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు గురైన బ‌‌‌‌‌‌‌‌తుక‌‌‌‌‌‌‌‌మ్మకుంటను అభివృద్ధి చేయడం హ‌‌‌‌‌‌‌‌ర్షణీయమని న్యాయమూర్తి జస్టిస్ విజ‌‌‌‌‌‌‌‌య్‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌రెడ్డి వ్యాఖ్యానించారు. సిటీలో ఇలాగే మ‌‌‌‌‌‌‌‌రో 5 చెరువుల అభివృద్ధి ప‌‌‌‌‌‌‌‌నులు జ‌‌‌‌‌‌‌‌రుగుతున్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది. 

చెరువుల పునరుద్ధరణ విషయంలో తలెత్తుతున్న సమస్యలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చెరువుల  ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌, బ‌‌‌‌‌‌‌‌ఫ‌‌‌‌‌‌‌‌ర్ జోన్ల ప‌‌‌‌‌‌‌‌రిధిలో ఇండ్లు లేదా భూములు కోల్పోయిన వారికి ట్రాన్స్​ఫరబుల్​ డెవలప్​మెంట్ రైట్స్ (టీడీఆర్) కింద స‌‌‌‌‌‌‌‌రైన న‌‌‌‌‌‌‌‌ష్టప‌‌‌‌‌‌‌‌రిహారం ఇవ్వాలని కోర్టు అభిప్రాయపడింది. ఇందుకోసం ప్రభుత్వం స‌‌‌‌‌‌‌‌రైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించింది.