- టెన్త్ ప్రశ్నపత్రం లీక్ కేసు దర్యాప్తు తీరుపై అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: 2023లో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించి బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది. పోలీసు దర్యాప్తు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. ఫిర్యాదులోని అంశాలకు రిమాండ్ రిపోర్టులోని వివరాలకు ఎలాంటి పొంతన లేదని, మోపిన ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ విచారణ జరిపిన ఈ క్వాష్ పిటిషన్‌లో.. పరీక్షా హాల్ నుంచి విద్యార్థి బయటికి వచ్చిన టైం, హెచ్ఎం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న టైం, ఎఫ్‌ఐఆర్ నమోదు టైం ఒకదానికొకటి పొంతన లేవని జడ్జి గమనించారు. దర్యాప్తు లోపాలను ఎత్తిచూపుతూ కేసును కొట్టివేసింది.
