శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విస్తారా 9i 877 విమానం ఆలస్యం అవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయాణికులు. శుక్రవారం ( నవంబర్ 21 ) ఉదయం శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో తిరుపతి వెళ్లాల్సిన శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ 10 అవుతున్నా కదలకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు ప్రయాణికులు..
విమానం ఆలస్యం కారణంగా ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. విమానం ఎప్పుడు బయలుదేరుతుందో అన్న సమాచారం కూడా ఇవ్వలేదంటూ సిబ్బందిపై మండిపడుతున్నారు ప్రయాణికులు.
విమానంలో టెక్నీకల్ ఇష్యూ రావడం వల్ల ఆలస్యం అయ్యిందని.. టెక్నీషియన్స్ లోపాన్ని సరిచేసే పనిలో ఉన్నారని తెలిపింది విస్తారా ఎయిర్ లైన్స్. ప్రయాణికుల భద్రతే తమ ప్రయారిటీ అని. వీలైనంత త్వరగా మరొక ఫ్లైట్ అరేంజ్ చేస్తామని తెలిపింది విస్తారా ఎయిర్ లైన్స్.
