పత్తి పంటకు నిప్పంటించిన రైతు..నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాలో అన్నదాత ఆవేదన

పత్తి పంటకు నిప్పంటించిన రైతు..నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాలో అన్నదాత ఆవేదన

కందనూలు, వెలుగు : ధర గిట్టుబాటు కావడం లేదని ఆగ్రహించిన ఓ రైతు తన పత్తి పంటకు నిప్పంటించాడు. వివరాల్లోకి వెళ్తే... నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన సురేందర్‌‌రెడ్డి 9 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పత్తి ఏరడానికి కూలీలు రాకపోవడం, కూలీ రేట్లు పెరగడంతో పాటు క్వింటాల్​పత్తికి వ్యాపారులు రూ.5 వేలు మాత్రమే చెల్లించడంతో గిట్టుబాటు కావడం లేదంటూ ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం తన పంటకు నిప్పంటించగా.. గమనించిన స్థానిక రైతులు మంటలను ఆర్పివేశారు. ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టగా, భారీ వర్షాలతో నష్టం వాటిల్లిందని వాపోయాడు.