మేఘా ఇంజనీరింగ్ సంస్థకు హైకోర్టులో చుక్కెదురు

మేఘా ఇంజనీరింగ్ సంస్థకు హైకోర్టులో చుక్కెదురు

మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి హైకోర్టులో చుక్కెదురైంది. V6 వెలుగు సంస్థకు ఖమ్మం కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. మేఘా ఇంజనీరింగ్ కాంట్రాక్టు పనులపై కథనాలు రాయకుండా v6 వెలుగు సంస్థను ఆదేశించాలంటూ మేఘా  కంపెనీ ఖమ్మం కోర్టును ఆశ్రయించగా.. న్యాయమూర్తి స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ V6 వెలుగు సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని V6 వెలుగు తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అడ్వకేట్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ప్రజా సమస్యల పట్ల వార్తా కథనాలు రాసే స్వేచ్ఛ మీడియా సంస్థలకు ఉంటుందని స్పష్టం చేసింది. బెదిరింపులతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయవద్దని వ్యాఖ్యనించింది. ఖమ్మం కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తల కోసం..

బీజేపీని ఎదుర్కోవాలంటే 50 ఏళ్లు తపస్సు చేయాలి

రాష్ట్ర కాంగ్రెస్ లో మరోసారి వర్గ పోరు