ఫ్యామిలీ అంటే అర్థమేంది?

ఫ్యామిలీ అంటే అర్థమేంది?
  • ప్రభుత్వ జీవో 141 ప్రకారం పరిహారం ఎందుకివ్వరు?
  • మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూనిర్వాసితుల కేసులో హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: భర్త/భార్యను కోల్పోయి, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వాళ్లు ‘కుటుంబం’లో భాగం కాదంటూ  రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు తప్పుబట్టింది. ఫ్యామిలీ అంటే ఏమిటో నిర్వచనం చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వ జీవో 141 ప్రకారం 18 ఏండ్లు నిండిన అవివాహితులైన యువతీ యువకులను ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ (డీపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)గా గుర్తించి భూనిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఎలా చెబుతారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ వ్యవహారంలో స్టే ఇస్తే తప్పేమిటని, స్తే ఉత్తర్వులు ఇస్తేనే ప్రభుత్వంలో కదలిక వస్తుందని ఈచెబుతూ.. ప్రభుత్వానికి జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎ.రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పి.నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావులతో కూడిన స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఆగస్టు 6 తేదీకి వాయిదా వేసింది. మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూనిర్వాసితులైన వేములఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన వై.కమలమ్మ మరో 51 మంది, ఏటిగడ్డ కిష్టాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.అన్నవ్వ మరో 26 మంది విడివిడిగా వేసిన రిట్లను గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారించింది. హైకోర్టు గతంలో ఆదేశించిన మేరకు ఈ నెల 5న బాధిత రైతులు సిద్దిపేట కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లారని, కానీ ఇద్దరికి మాత్రమే పరిహారం చెల్లించాలరని పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యాయవాది చెప్పారు. జీవో 141లోని ఎ ప్రకారం మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిల్లలున్న భార్యభర్తలను ఫ్యామిలీగా గుర్తిస్తూ డబుల్ బెడ్రూ ఇల్లు, రూ.7.5 లక్షల పరిహారం, 250 గజాల స్థలం ఇస్తామని, అదే జీవోలోని బి ప్రకారం 18 ఏళ్లు నిండిన వారిని కుటుంబంగా గుర్తిస్తామని ఉందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. భర్త కోల్పోయిన ఒంటరి మహిళను ఒక ఫ్యామిలీగా గుర్తించకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్న ఒంటరి మహిళకు విడిగా పరిహారం ఇవ్వాలని డీపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో కుటుంబం అంటే ఏంటో చెప్పాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు పరిహారం విషయంలో ప్రభుత్వం గతంలో హైకోర్టుకు ఇచ్చిన హామీ అమలు చేయలేదని సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామ రైతులు హైకోర్టులో క్లారిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశారు. దీనిని ఆదే గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణ జరిపింది.