ఈసీఐఎల్‌‌‌‌కు ఎదురుదెబ్బ.. గ్రాట్యుటీ పెంపు నిర్ణయాన్ని అమలు చేయాలన్న హైకోర్టు

ఈసీఐఎల్‌‌‌‌కు ఎదురుదెబ్బ.. గ్రాట్యుటీ పెంపు నిర్ణయాన్ని అమలు చేయాలన్న హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రిటైర్‌‌‌‌ ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంపు విషయంపై ఈసీఐఎల్‌‌‌‌ దాఖలు చేసిన అప్పీల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ను హైకోర్టు ఇటీవల డిస్మిస్‌‌‌‌ చేసింది. గ్రాట్యుటీ యాక్ట్‌‌‌‌ మేరకు రిటైర్డ్‌‌‌‌ ఎంప్లాయి చనిపోతే వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ పొందే హక్కే గ్రాట్యుటీ అని జస్టిస్‌‌‌‌ సూరేపల్లి నంద తీర్పు చెప్పారు. ఈసీఐఎల్‌‌‌‌లో 2007 నుంచి 2010 మధ్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైరయ్యారు. వాళ్లకు గ్రాట్యుటీ సీలింగ్‌‌‌‌ లిమిట్‌‌‌‌ రూ.3.5 లక్షలు కాకుండా రూ.10 లక్షలుగా పీఎఫ్‌‌‌‌ అప్పీలేట్‌‌‌‌ అథారిటీ తీర్పు చెప్పింది. దీనిని రద్దు చేయాలంటూ ఈసీఐఎల్‌‌‌‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈసీఐఎల్‌‌‌‌ గ్రాట్యుటీ ట్రస్ట్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ప్రకారమే చెల్లింపులు ఉండాలని, 2010లో గ్రాట్యుటీ యాక్ట్‌‌‌‌ను కేంద్ర ప్రభుత్వం సవరించి గ్రాట్యుటీ సీలింగ్‌‌‌‌ ను రూ.3. 5 లక్షల నుంచి రూ 10 లక్షలకు పెంచిందని ఇక్కడి కేసులోని ఉద్యోగులకు వర్తించదని లాయర్‌‌‌‌ వాదించారు. అది 2010,  మే 24 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. 

ఇక్కడ కేసులోని ఉద్యోగులు 2010కి ముందే రిటైర్‌‌‌‌ అయ్యారని, కాబట్టి వాళ్లకు పెంపు వర్తించదని చెప్పారు. ఈ వాదనలను ఉద్యోగుల తరఫు న్యాయవాది పివి. కృష్ణయ్య వ్యతిరేకించారు. 2007 జనవరి1 నుంచి గ్రాట్యుటీని రూ 10 లక్షలకు పెంచాలని బోర్డ్ ఆఫ్‌‌‌‌ డైరెక్టర్స్‌‌‌‌ తీర్మానం చేశాక ఇప్పుడు 2010 నుంచి చెల్లిస్తామని చెప్పడం చట్ట వ్యతిరేకమన్నారు. ఆర్కి కపూర్‌‌‌‌ వర్సెస్‌‌‌‌ ఐటీ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారంఈ గ్రాట్యుటీ ఔదార్యంతో ఇవ్వడం లేదన్నారు. పీఆర్‌‌‌‌ఎసీ సిఫార్సుల ప్రకారం 2008, నవంబర్‌‌‌‌ 26న కేంద్రం ఆఫీసు మెమోరాండం జారీ ప్రకారం కూడా ఉద్యోగులు అర్హులన్నారు. వాదనల విన్న న్యాయమూర్తి.. ఇప్పటికే చెల్లించిన మొత్తం మినహా మిగిలిన దానిపై వడ్డీతో చెల్లించాలని తీర్పు చెప్పారు. అప్పీలేట్‌‌‌‌ అథారిటీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు.