కలుషిత నీటితో కూరగాయల సాగు కరెక్ట్ కాదు: హైకోర్టు

కలుషిత నీటితో కూరగాయల సాగు కరెక్ట్ కాదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: కలుషిత నీటితో కూరగాయలు సాగుచేయడం, వాటిని విక్రయించడం కరెక్ట్ కాదని హైకోర్టు తెలిపింది. చెడు నీటితో పండిన పంటలను తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించింది. అలాంటి కూరగాయలను విక్రయించకుండా జీహెచ్ఎంసీ, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

అలాగే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల రక్షణకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎసీ)ప్రవీణ్ కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్ రెడ్డి కమిటీ/ అడ్వొకేట్ కమిషనర్లు అందించిన నివేదికపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు 6 వారాల గడువు ఇస్తున్నామని.. తదుపరి విచారణలోగా ఏం చర్యలు చేపట్టారన్న దానిపై నివేదికను సమర్పించాలని చెప్పింది.