
- పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల నియామావళిని ఉల్లంఘించారనే కేసుల్లో సాక్షుల వాంగ్మూలలన్ని ఒకేలా ఉండటంపై వివరణ ఇవ్వాలని పోలీసులను గురువారం హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించారని పేర్కొంటూ తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ దాఖలు చేసిన మూడు వ్యాజ్యాలను జస్టిస్ మౌసమీ భట్టాచార్య విచారణ జరిపారు.
పోలీసులు కేసులను దర్యాప్తు చేసి ప్రజాప్రతినిధుల కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్‌లోని సాక్షుల వాంగ్మూలాలన్ని ఒకే తీరుగా ఉండంపై వివరణ ఇవ్వాలని పోలీసులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను 22కు వాయిదా వేశారు.