తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఐటీ అధికారిని అరెస్టు చేయొద్దు:హైకోర్ట్

తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఐటీ అధికారిని అరెస్టు చేయొద్దు:హైకోర్ట్

ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌  రత్నాకర్ కు హైకోర్టులో ఊరట లభించింది. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాల సందర్భంగా ఆయన కుమారుడు భద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో  రత్నాకర్ పై బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు నమోదైంది. అయితే తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రత్నాకర్ హైకోర్టును ఆశ్రయించారు.

శుక్రవారం  ఆయన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తమ విధులకు మంత్రి మల్లారెడ్డే ఆటంకం కలిగించారని ఆ  పిటిషన్ లో పేర్కొన్నారు.  దీనిపై విచారణ చేపట్టిన  రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ...  నాలుగు వారాల పాటు  స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రత్నాకర్ ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది.