కామారెడ్డి జిల్లాలో జనవరి 17 నుంచి సీఎం కప్ పోటీలు

కామారెడ్డి జిల్లాలో జనవరి 17 నుంచి  సీఎం కప్ పోటీలు

కామారెడ్డి, వెలుగు : సీఎం కప్​ 2025లో భాగంగా కామారెడ్డి జిల్లాలో క్లస్టర్, మండల, నియోజక, జిల్లాస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం తెలిపారు.  ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ వివరాలను ఆన్​లైన్​లో  నమోదు చేసుకోవాలన్నారు. 

<https://satg.telangana.gov.in> లో  ఎంట్రీ చేసుకోవాలన్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు క్లస్టర్ స్థాయి,  మండల స్థాయిలో  28 నుంచి 31 వరకు,  నియోజకవర్గ స్థాయిలో  ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు,  జిల్లాస్థాయిలో  ఫిబ్రవరి 10 నుంచి  14 వరకు, రాష్ర్టస్థాయిలో  19 నుంచి 26 వరకు క్రీడా పోటీలు ఉంటాయన్నారు.    

అథ్లెటిక్స్,  వాలీబాల్,  సాప్ట్​బాల్,  విలువిద్య,  కబడ్డీ,  తైక్వాండో, బ్యాడ్మింటన్,  ఖోఖో,  బిలియర్డ్స్, స్నూకర్, బాక్సింగ్,  జూడో,  ఈత, చెస్, కరాటే,  కుస్తీ, బేస్​బాల్, యోగా,  టేబుల్ టెన్నీస్,  నెట్ బాల్,  స్కేటింగ్, వెయిట్ లిప్టింగ్, జామ్నాస్టిక్,  సైక్లింగ్, రోయింగ్, హాకీ,  పుట్​బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.