
హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 మెయి న్స్ పరీక్ష పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని లేదా తిరిగి నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయా లని కోరుతూ దాఖలైన రెండు అప్పీళ్లపై బుధవారం హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించ నుంది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలంటూ షగుప్తా ఫిరౌషీ వేసి న అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట మంగళ వారం విచారణకు వచ్చింది.
అయితే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అప్పీల్ చేసిందని కమిషన్ న్యాయవాది చెప్పడంతో రెంటింటినీ కలిపి బుధవా రం విచారిస్తామని వెల్లడించింది. పిటిష నర్ లాయర్ కె.లక్షీమనరసింహ, సర్వీస్ కమిషన్ అడ్వొకేట్ రాజశేఖర్ విచారణ కు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షల్లో అవకతకవలు జరిగాయని చెప్పి మొత్తం గ్రూప్ 1 అభ్యర్థుల ఎంపికను రద్దు చేయ డం చెల్లదని అర్హత సాధించిన అభ్యర్థు లు, సర్వీస్ కమిషన్ అప్పీల్స్‌లో పేర్కొన్నాయి.