వార్ రూం కేసు : సునీల్ కనుగోలు పిటిషన్‌పై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు

వార్ రూం కేసు : సునీల్ కనుగోలు పిటిషన్‌పై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు

కాంగ్రెస్ వార్ రూం కేసులో సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకటించనుంది. సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన 41ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ సునీల్ కనుగోలు ఇటీవలే కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు.. తీర్పును నేటికి వాయిదా వేసింది. దాంతో పాటు పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది

సునీల్ కనుగోలు కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులు ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో కాంగ్రెస్ వార్ రూమ్ తో సునీల్ కనుగోలుకు సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఈ కారణంగా ఎఫ్ఐఆర్ లో సునీల్ కనుగోలు పేరును తొలగించాలని కోరారు. వీడియో స్పూఫ్ లకు సునీల్ కనుగోలుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సీసీఎస్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని  కోరారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలు ఏ1 గా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు.