సిట్ రివిజన్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు

సిట్ రివిజన్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు

ఫాంహౌస్ కేసుకు సంబంధించి సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్పై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. గురువారం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. ఏసీబీ కోర్టు తీర్పును రద్దు చేయాలని సిట్ వాదించగా.. కేసును విచారించే అర్హత లా అండ్ ఆర్డర్ పోలీసులకు లేదని ప్రతివాదుల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.

ఫాం హౌస్ కేసు ఎఫ్ఐఆర్లో ఏ 4గా బీఎల్ సంతోష్, ఏ 5 తుషార్, ఏ 6 జగ్గుస్వామి, ఏ 7 శ్రీనివాస్ పేర్లను ఎఫ్ఐఆర్లో చేరుస్తూ సిట్ మెమో దాఖలు చేయగా ఏసీబీ కోర్టు దాన్ని రిజక్ట్ చేసింది. దీంతో సిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఏసీబీ కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని వాదించింది. ఏసీబీ కోర్టు మెమో కొట్టివేయడంతో హైకోర్టుకు వచ్చామని, మెమోను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఏసీబీ కోర్టు తీర్పుపైనే తాము హైకోర్టుకు వచ్చామని, ఇందులో ప్రతిపాదిత నిందితుల తరఫు వాదనలు వినాల్సిన అవసరం లేదని హైకోర్టుకు వివరించారు. సిట్ నమోదు చేసిన కేసులో తమ క్లైయింట్స్ భాగస్వాములైనందున.. తమ వాదనలు కూడా వినాలని నలుగురు ప్రతిపాదిత నిందితుల న్యాయవాదులు హైకోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించింది.