గ్రూప్-2 వైట్‌నర్ వివాదంపై హైకోర్టు తీర్పు

గ్రూప్-2 వైట్‌నర్ వివాదంపై హైకోర్టు తీర్పు

గ్రూప్ 2 ఫలితాలకు అడ్డంకి తొలగిపోయింది. బబ్లింగ్, వైట్ నర్ అభ్యర్థులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలంటూ TSPSCని ఆదేశించింది. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్, వైట్ నర్ వాడిన కూడా  పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. దీంతో గతంలో సింగిల్ బెంచ్ తీసివేసిన 343 మంది అభ్యర్ధులకు డబుల్ బెంచ్ లో ఊరట లభించినట్లైంది. హైకోర్టు తీర్పుతో గతంలో తీసివేసిన 343 మంది అభ్యర్ధులను పునర్ సమీక్షించనున్నంది TSPSC.

ఈ పరీక్షల్లో 1032 పోస్టులకు  1 : 3 రేషియోలో 3147 మంది సెలక్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ అభ్యర్ధులకు సంబంధించిన వెరిఫికేషన్ కూడా పూర్తైంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో 1 : 2 రేషియో పద్ధతిలో మరోసారి మెరిట్ లిస్ట్ విడుదల చేసి.. ఇంటర్వ్యూలకు పిలవనుంది TSPSC.