కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.  

ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ లను నామినేట్ చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు, దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సవాల్ చేశారు. ఇవాళ పిటిషన్ విచారించిన హైకోర్టు.. వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించవద్దని.. ఫిబ్రవరి 8 న మళ్లీ వాదనలు వింటామని తెలిపింది. 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ, నామినేట్ చేస్తున్నట్లు వీరిద్దరి పేర్లను గవర్నర్ కు పంపారు. అయితే గవర్నర్  వీరి పేర్లను ఆమోదించలేదు.  దీనిపై దాసోజు శ్రవణ్,  సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు.