టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని హెచ్చరించిన హైకోర్టు

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని హెచ్చరించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: వరి విత్తనాల అమ్మకంపై సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినా వినేది లేదని  కామెంట్స్ చేసినట్టు తేలితే జైలుకు పంపిస్తామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ని హైకోర్టు హెచ్చరించింది. కామెంట్లు చేశారా? లేదా? స్పష్టంగా పేర్కొంటూ అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేయాలని మాజీ కలెక్టర్, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని బుధవారం ఆదేశించింది.  హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నా వరి విత్తనాల్ని అమ్మనీయమంటూ 2021 అక్టోబర్‌‌‌‌ 25న అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్స్, విత్తన డీలర్ల మీటింగ్‌‌‌‌లో వెంకట్రామిరెడ్డి హెచ్చరించినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారిస్తోంది. వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్‌‌‌‌లో కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేసిందీ, లేనిదీ చెప్పకుండా ఇతర వివరాలను ఇవ్వడాన్ని తప్పుబట్టింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్డర్లనే లెక్కచేసేది లేదని అని ఉంటే కఠిన ఉత్తర్వులు జారీ చేస్తామని, జైలుకు పంపుతామని   హెచ్చరించింది. ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ మళ్లీ అఫిడవిట్‌‌‌‌ వేయాలని చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్‌‌‌‌ అభినంద్‌‌‌‌కుమార్‌‌‌‌ షావిలి డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఆదేశించి విచారణను ఏప్రిల్‌‌‌‌ 4కి వాయిదా వేసింది.