
హైదరాబాద్, వెలుగు: బీటెక్ పూర్తి చేసిన స్టూడెంట్స్జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని జేఎన్‌టీయూహెచ్ రెక్టార్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డి అన్నారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ, జూనియర్లకు ఆదర్శంగా నిలవాలని, నైతిక విలువలను పాటించాలని కోరారు.
హైదరాబాద్ బోగారంలోని హోలీమేరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో సోమవారం జరిగిన గ్రాడ్యుయేషన్ డేకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ చదివిన పిల్లలపై తల్లిదండ్రులకు ఎన్నో ఆశలుంటాయని, వారి ఆకాంక్షలను నెరవేర్చాలని సూచించారు.
ఉద్యోగాలే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాలన్నారు. అనంతరం కాలేజీ టాపర్లకు, 286 మంది స్టూడెంట్స్కు పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హోలీమేరీ కాలేజీ ఫౌండర్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, ఫౌండర్ సెక్రటరీ విజయశారదరెడ్డి, కాలేజీ చైర్మన్ సిద్ధార్థరెడ్డి, ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యంపాల్గొన్నారు.