
- హైపవర్ కమిటీ మీటింగ్లో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: సింగూరు ప్రాజెక్ట్ కాల్వల పనుల ఈపీసీ టెండర్లను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. శనివారం సెక్రటేరియెట్లో జరిగిన హైపవర్ కమిటీ (హెచ్ పీసీ) మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2005లో ఈపీసీ పద్ధతిలో కుడి, ఎడమ కాల్వ నిర్మాణానికి ప్రభుత్వం రూ.84.45 కోట్లతో టెండర్ పిలిచింది.
ఏజెన్సీతో ఒప్పందం కూడా చేసుకున్నది. అయితే, వివిధ సమస్యలతో ఇప్పటివరకు ఆ పనులు పూర్తి కాలేదు. ఈ ఏడాది డిసెంబర్ వరకు పనులు పూర్తి చేయాలని డెడ్లైన్ గా పెట్టారు. పనులు లేట్ అవుతుండడంతోప్రభుత్వం వద్ద ఉన్న బ్యాంక్ గ్యారంటీని మినహాయించుకుని మిగిలిన డబ్బును చెల్లించేందుకు హెచ్ పీసీలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.