- టీ ఫైబర్ ప్రాజెక్టు అమలు ఒప్పందం త్వరగా కుదుర్చుకోవాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరిన సీఎం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు అమెండెడ్ భారత్ నెట్ కార్యక్రమం (ఏబీపీ) కింద టీ- ఫైబర్ ప్రాజెక్టు అమలు ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో బుధవా రం ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో నెట్‌వర్క్ దెబ్బతిన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ పనులను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి, మిగతా ప్రాంతాలతో సమానం గా ఆధునిక ఫైబర్ మౌలిక సదుపాయాలతో అనుసంధానించనున్నట్టు వివరించారు. ఏబీపీ ప్రోగ్రాంను రాష్ట్రంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా అమ లు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా మండ లం నుంచి గ్రామ పంచాయతీ వరకు విస్తరించి ఉన్న రింగ్ నెట్‌వర్క్ ఆస్తులను ‘డిజిటల్ భారత్ నిధి’కి బదిలీ చేయడంపై కేంద్రం ఒక స్పష్టమైన విధానాన్ని (పాలసీ) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రస్తా వించారు. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ బలమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను ఈ సమావేశంలో సీఎం సుదీర్ఘంగా వివరించారు.
కేంద్ర మంత్రి సానుకూల స్పందన
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి జ్యోతిరాత్య సింధియా సానుకూలంగా స్పందించారు. తెలంగాణ డిజిటల్ లక్ష్యాలను అభినందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా పూర్తి సహకారం అంది స్తామని, పెండింగ్ నిధుల విడుదలను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, తెలంగాణ భవిష్యత్తు ను తీర్చిదిద్దే ఈ బలమైన నెట్‌వర్క్ నిర్వహణ కోసం ఒక ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’ (ఎస్పీవీ) ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంపై కేంద్ర మంత్రి అభినందించారు.
