ఢిల్లీలో హై టెన్షన్.. ప్రధాని మోదీ నివాసం చుట్టూ 144 సెక్షన్..

ఢిల్లీలో హై టెన్షన్.. ప్రధాని మోదీ నివాసం చుట్టూ 144 సెక్షన్..

ఢిల్లీలో హై టెన్షన్ కొనసాగుతోంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ నేతలు వరుస ఆందోళనలకు పిలుపునిచ్చారు. మార్చి 31 న భారీ ర్యాలీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటించింది. ఇందులో భాగంగానే మంగళవారం మార్చి26న  ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో నిరసనలు జరగకుండా చూడటానికి, శాంతి భద్రతలను కాపాడటానికి మోదీ నివాసానికి గట్టి భద్రతను ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. 

ALSO READ :-కొత్తపల్లిలో పూజలు చేసిన మెదక్ ఎమ్మెల్యే

దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీస్ బలగాలు భద్రతను పటిష్టం చేశాయి. నిరసనలు ఢిల్లీలో పెద్ద అలజడులను రేపుతాయని పోలీసులు ముందుగానీ ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నివాసం చుట్టూ.. సెక్షన్ 144 విధించారు. మరో వైపు లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన కేజ్రీవాల్ ను ఈడీ ప్రశ్నిస్తుంది. మార్చి 28 వరకు ఆయన ఈడీ కస్టడీలోనే కొనసాగనున్నారు.