మునావర్ షోను అడ్డుకుంటామంటున్న బీజేవైఎం, భజరంగ్​ దళ్​

మునావర్ షోను అడ్డుకుంటామంటున్న బీజేవైఎం, భజరంగ్​ దళ్​

మునావర్ ఫారుఖీ కామెడీ షోపై టెన్షన్ కొనసాగుతోంది. షోకు అనుమతి ఇవ్వొద్దని ఓవైపు బీజేపీ హెచ్చరిస్తున్నా.. మాదాపూర్ పోలీసులు అనుమతి ఇచ్చారు .  రేపు హైదరాబాద్ లో మునావర్ స్టాండప్ కామెడీ షో జరగనుంది. అయితే మునావర్ షోను అడ్డుకుంటామని రాజాసింగ్ చెప్తున్నారు . కామెడీ షోకు అనుమతిస్తే వేదికను తగలబెడతామని ఇది వరకే హెచ్చరించారు. వేదిక ఎక్కడనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. టికెట్ కొన్నవారికి వేదిక ఎక్కడనేది మెసేజ్ వెళ్తుందని తెలుస్తోంది.

రేపు ఏమైనా జరగొచ్చని.. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు . అటు బీజేవైఎం, భజరంగ్ దళ్ కూడా మునావర్ షోను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. గతంలో ఇతర సిటీల్లో హిందూ దేవుళ్లను అవమానించేలా మునావర్ స్టాండప్ కామెడీ షో చేశారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అటువంటి వ్యక్తికి.. హైదరాబాద్ లో షోకు ఎలా పర్మీషన్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.